అల్ ఇండియా సమతా పార్టీ అధ్వర్యంలో నిరసన
నల్లమల్ల అడవిలో యురేనియం తవ్వకాలు కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే ను వెంటనే నిలిపివేయాలని ఆలిండియా సమతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
అడవి బిడ్డల జీవితాలతో పాటు ఇక్కడ జీవరాశి అడవి సంపద,గాలి,నీరు, వాతావరణంను కలుషితం చేసే యురేనియం తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెలుపుతూ,నల్లమలలోని ప్రకృతిని కాపాడుకోవాలి కాబట్టి యురేనియం తవ్వకాలకు ఇచ్చిన సర్వే అనుమతులను నిలుపుదల చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆలిండియా సమతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డి. సంఘమేశ్వర్ డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు నరేష్,సమతా పార్టీ రాష్ట్ర నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.