అరుణ్ జైట్లీ అస్తమయం ఎయిమ్స్ నుంచి అరుణ్ జైట్లీ భౌతికకాయం తరలింపు
![arun jetly](https://www.achampeta.com/wp-content/uploads/2019/08/arunjetly-e1566643118217.jpg)
కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జైట్లీ మరణించిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని కైలాష్ కాలనీలోని నివాసానికి తరలించారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సందర్శనార్థం రేపు ఉదయం వరకూ నివాసంలోనే జైట్లీ పార్థివదేహాన్ని ఉంచుతారు. అనంతరం ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పార్టీ శ్రేణుల సందర్శనార్థం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచుతారు. రేపు సాయంత్రం నిగమ్‌బోధ్ ఘాట్‌లో జైట్లీ అంత్యక్రియలు నిర్వహిస్తారు. అనారోగ్య కారణాలతో ఈ నెల 9న జైట్లీ ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే.