అభివృద్ధి పనులలో వేగం
పట్టణంలోని వార్డులలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. కుంచించుకు పోయిన నాళాల(మోరీ) వ్యవస్థ పునర్నిర్మాణ పనులు మరియు విస్తృత పరచడంతో పాటు అంతర్గత రహదారుల నిర్మాణ పనులలో వేగం పెంచారు. 2వ వార్డులో నాళాల పునర్నిర్మాణ పనులు పూర్తి కావడంతో,ప్రస్తుతం 5వ వార్డు,6వ వార్డు,13వ వార్డులలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
పట్టణ అభివృద్ధితో పాటు నగర సుందరీకరణలో ఇవి భాగం కానున్నాయి.