అధికార లాంఛనాలతో కానిస్టేబుల్ నరేష్ అంత్యక్రియలు.
పదరా మండల కేంద్రం లోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నా కానిస్టేబుల్ నరేష్ (33) గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతూ హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు. నరేష్ స్వంత గ్రామం ఐన రంగాపూర్ లో అతని అంత్యక్రియలు లాంఛన ప్రాయంగా జరిగాయి.