అచ్చంపేట లో అడుగంటుతున్న భూగర్భ జలాలు.
ప్రతిరోజూ వర్షం వచ్చేలా మబ్భులు కమ్ముకుంటూ రైతులను మరియు ప్రజలను ఊరిస్తున్నాయి. ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు నిత్యం నిరాశే ఎదురవుతుంది.
అదేవిదంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి 2 (రెండు) ఈంచుల నీళ్లు ఉన్న బోర్లు చాలావరకు ఎండిపోతున్నాయి పంటపొలాల్లో నే కాకుండా ఇళ్లల్లో ఉండే బోర్లు కూడా ఎండి పోయాయి. దీనితో ఈ సంవత్సరం నీటి కరువు తాండవిస్తుంది అని అచ్చంపేట ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఈపటికైనా నీటికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అందరు నీటిని పొదుపుగా వాడుకొని మరియు భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ఇంటి సమీపం లో ఇంకుడు గుంతలు తీసుకోవడం మరియు మొక్కలను నాటుకోవడం ధ్వారా ఇళ్ళలో ఉన్న బోర్లకు చాలావరకు మేలు జరుగుతుంది.