అచ్చంపేట మల్లం కుంట లో అక్రమ కట్టడాల కూల్చివేత.
అచ్చంపేట పట్టణంలోని మల్లంకుంటలో కట్టిన అక్రమ కట్టడాలను కోర్ట్ ఉత్తర్వుల మేరకు మున్సిపాలిటీ వారు పోలీసుల భద్రత నడుమ శుక్రవారం ఉదయం కూల్చివేశారు.గత కొంత కాలంగా ముదిరాజ్,తెలుగు కులస్తుల ఆధ్వర్యంలో కుంటలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై నిరసనలు,అందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కోర్ట్ ఉత్తర్వుల ప్రకారం చెరువులు, కుంటల ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, కేవలం వ్యవసాయ సంబంద కార్యక్రమాలు మాత్రమే నిర్వహించు కోవాలని స్పష్టం చేసింది. ఎలాంటి సంఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసులను మోహరించారు.