అచ్చంపేట నగర పౌరుల హర్షాతిరేకం

370ఆర్టికల్ రద్దుతో పాటు జమ్మూ కాశ్మీర్ ను రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని భారత దేశ ప్రజలు స్వాగతించారు.
సంచలన నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం తీసుకుందని అచ్చంపేట నగర పౌరులు, ప్రజలు ప్రభుత్వాన్ని కొనియాడారు.
అచ్చంపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కళాశాల విద్యార్థిని,విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని చేతబూని పట్టణంలోని ప్రధాన రహదారులపై తిరుగుతూ భరతమాత నినాదాలు చేశారు.