అచ్చంపేటలో భారీ వర్షం
అచ్చంపేట పట్టణంలో శుక్రవారం కుండపోతగా వాన కురిసింది.వర్షం కారణంగా పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాళాలు ఉప్పొంగి ప్రవహించడంతో పలు కాలనీలోని రోడ్లని బురదమయంగా మారాయి.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే తెలియజేసిన విషయం తెలిసిందే.