అచ్చంపేటలో ప్రారంభమైన తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
అచ్చంపేటలో ప్రారంభమైన తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
అచ్చంపేటలోని యాదవసంఘము అధ్వర్యంలో తెరాసపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా రైతు సమన్వయకర్త శ్రీ పోకల మనోహర్ గారు మరియు అచ్చంపేట నగర పంచాయతీ చైర్మన్ కె. తులసీరామ్ గారు హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి సభ్యత్వంను గడ్డం పర్వతాలు గారు పోకల మనోహర్ గారి నుండి స్వీకరించారు.
అనంతరం యాదవ సంఘము నాయకులు, పార్టీ అభిమానులు కె. తులసీరామ్ గారి నుండి సభ్యత్వం తీసుకుని పేర్లు నమోదు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పోకల మనోహర్ గారు మాట్లాడుతూ…
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 10 వరకు జరుగుతుందని, ప్రతి కార్యకర్త,పార్టీ అభిమానులు సభ్యత్వం తీసుకుని పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.