అచ్చంపేటలో తెరాస శ్రేణులు సంబరాలు
తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో మంత్రి కేటీఆర్ గారు యురేనియం తవ్వకాలపై స్పందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని, భవిష్యత్తులోనూ ఇవ్వబోదని, తెరాస పార్టీ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకమేనని వారు తెలియజేయడంతో అచ్చంపేట పట్టణంలోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద తెరాస నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ కి నల్లమల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కే.తులసీరామ్,జెడ్పిటిసి మంత్ర్య నాయక్,పార్టీ మండల అధ్యక్షుడు నరసింహ గౌడ్,తెరాస రాష్ట్ర నాయకుడు గంగాపురం రాజేందర్,అచ్చంపేట పట్టణ అధ్యక్షుడు రమేష్ రావు,మాజీ ఎంపీపీ పర్వతాలు, మైనారిటీ నాయకులు అమీనుద్దిన్,రహమత్,అన్వర్, తెరాస కౌన్సిలర్ లు విష్ణు,బాలరాజు,పర్వతాలు,గోపాల్ నాయక్,శంకర్,సూర్య,యుగేధర్ గౌడ్ లు పాల్గొన్నారు.