అచ్చంపేటలో గంజాయి సాగు పై పోలీసుల దృష్టి

అచ్చంపేట మండలంలో గంజాయి సాగు జరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి రావడంతో నిఘా వర్గాలు దృష్టి సారించి శుక్రవారం సాయంత్రం దాడి చేసి పలువురు సాగు దారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అచ్చంపేట ప్రాంతంలో గంజాయి సరఫరా అధికంగా జరుగుతుందన్న సమాచారం పోలీసులకు అందడంతో నిఘా వర్గాలు కాపుగాచి పలువురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.యువకులు గంజాయి సాగు చేస్తున్న వారి వివరాలు వెల్లడించడంతో శుక్రవారం పోలీసులు చేదురుబావి తండా ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని అచ్చంపేట పోలీస్ స్టేషన్ కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు.