అచంపేట్ లో CAB, NRC బిల్లులకు వ్యతిరేక నిరసన.
CAB, NRC బిల్లులకు వ్యతిరేక నిరసన* స్థానిక పట్టణంలో జామియా మసీదు ఎదుట మైనారిటీ JAC అచంపేట్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టదలచిన CAB,బిల్లు,NRC యాక్ట్ లను నిరసిస్తూ ప్లడ్ కార్డ్ లతో ధర్నా చేపట్టారు ధర్నాలో దళిత సంఘాల నాయకులు పత్కుల శ్రీశైలం గారు మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ బిల్లును రద్దు చేసుకోవాలని,ఈ బిల్లు ఆమోదం పొందితే తదుపరి పరిణామాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని,ఈ దేశ పౌరునిగుర్తింపు గా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ,ఓటర్ కార్డ్ లు చూపిస్తే చెల్లవని తాత ముత్తా తల ఆధారం చేసుకొని పౌరసత్వం ఇస్తారని దీని వెనక రాజ్యాంగ వ్యతిరేక శక్తుల కుట్ర జరుగుతోందని, దానిని తిప్పి కొట్టాలని అన్నారు,CAB కి వ్యతిరేకంగా మరింత పోరాటం చేయాలని అన్నారు,కార్యక్రమంలో మజీద్ కమిటీ సదర్ సిద్దిక్, MIM నాయకులు జావేద్,గౌస్,సాజిద్,మరియు మైనారిటీ వర్గాలు పాల్గొన్నారు