అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట పట్టణంలో నెలకొన్న సమస్యలు మరియు పట్టణ అభివృద్ధి పై ఆర్&బి అతిథి గృహంలో పురపాలక సంఘం అధికారులు ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి స్థానిక ప్రజలు,అధికారులు పెద్ద ఎత్తున్న హాజరై తాము ఎదుర్కుంటున్న సమస్యలను, అలాగే నగర అభివృద్ధి పై తగిన సూచనలు,సలహాలను సూచించారు. వాటిపై విపులంగా చర్చించిన అనంతరం ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ… అచ్చంపేట అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, ఎలాంటి సమస్య వచ్చిన తనకు కానీ,చైర్మన్ కు కానీ లేదా పురపాలక అధికారుల దృష్టికి కానీ తీసుకురావాలన్నారు. నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. సమస్యల పరిష్కారం పై పురపాలక అధికారులకు తగిన సూచనలిస్తూ,సత్వరమే వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు.
ఈ సమావేశానికి అన్నీ శాఖల అధికారులు,పురపాలక చైర్మన్,కౌన్సిలర్లు,తెరాస శ్రేణులు,ప్రజలు పాల్గొన్నారు.