అక్రమ వెంచర్ లేఅవుట్లపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
అచ్చంపేట పట్టణంలోని శివసాయినగర్ కాలనీ వాసులు తమ కాలనీ సమీపంలో వేసిన వెంచర్ నియమ నిబంధనలకు విరుద్ధము వుందని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు.
శివసాయినగర్ కాలనీకి ఉత్తర భాగాన ఉన్న సర్వేనెంబర్ 295 లోగల రెండు ఎకరాల వ్యవసాయ భూమి యందు మా కాలనీ హద్దులకు రోడ్డును వదలకుండా ప్రభుత్వ మరియు మునిసిపాలిటీ నిబంధనలకు వ్యతిరేకంగా 20 ఫీట్ల 25 ఫీట్ల రోడ్లతో వెంచర్ వేసి ప్లాట్లను అక్రమంగా విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వెంచర్ నిర్వాహకులకు మునిసిపాలిటీ రూల్స్ ప్రకారం వెంచర్ వేసుకోవాలని,కాలనీ మరియు వెంచర్ కి మధ్యలో రోడ్డు విడవాలని చెప్పినామని, మరియు ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు గారికి చాలాసార్లు ఫిర్యాదు చేసిన ఏమాత్రం పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కావున తమపై దయవుంచి అక్రమ లేఅవుట్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్న వారిపై మరియు అచ్చంపేట మున్సిపల్ కమిషనర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నామని శివసాయినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.ఎన్.స్వామి మరియు ప్రధాన కార్యదర్శి వి. కృష్ణయ్య తెలియజేశారు.