అక్టోబర్ 5 నుంచి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె

0
achampet

అక్టోబర్ 5 నుంచి సమ్మెకు దిగుతున్నట్టు ఉద్యోగుల సంఘం నేతలు ప్రకటించారు. సెప్టెంబర్ 3న సమ్మెకు నోటీసు ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం కనీసం తమను పట్టించుకోలేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ మీద పిచ్చికుక్క అనే ముద్ర వేసి.. సంస్థను చంపేయాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని వారు మండిపడ్డారు. తెలంగాణ ఆర్టీసీ నష్టాలకు తాము కారణం కాదని స్పష్టం చేశారు.

తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి రూ.2800 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. బడ్జెట్‌లో పెట్టిన నిధులు కూడా ఇవ్వడం లేదన్నారు. కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు ఆ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. తాత్కాలిక ఉద్యోగులు అనే దాన్నే తీసేసి అందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పిన కేసీఆర్ ఐదేళ్లయినా మాట నిలబెట్టుకోలేదని చెప్పారు. ఆర్టీసీలో 6వేల మంది రిటైర్ అయితే, ఆ ఖాళీలు భర్తీ చేయలేదని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *