అంబెడ్కర్ స్ఫూర్తిని కొనసాగిదాం-ఆశయాలను సాదిదాం
అంబెడ్కర్ స్ఫూర్తిని కొనసాగిదామని జ్ఞాన చైతన్య యాత్ర ఆధ్వర్యంలో ఊరూరా సభలు సమావేశాలు ఏర్పాటు చేశారు.
అచ్చంపేటలోని అంబెడ్కర్ చౌరస్తాలో ఆదివారం రాత్రి జ్ఞాన చైతన్య యాత్ర అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,ప్రఖ్యాత గేయ రచయిత, కళాకారుడు ఏపూరి సోమన్న పాల్గొని మాట్లాడారు.
“అక్షరమే ఆయుధమై సాగుదాం-పల్లె పల్లెకు పాటై కదులుదాం” అనే శీర్షిక పై జనానికి జ్ఞాన వంత మైన యాత్రలు చేస్తూ ఉత్తేజ పరుస్తున్నారు.
ఏపూరి సోమన్న గారు…అంబెడ్కర్ ఆశయాలను సాధించాలని,ఊరూరా అంబెడ్కర్ విగ్రహలను ఆవిష్కరించాలని,ఆ దిశగా యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు.అనంతరం యువతను ఉతేజపరుస్తూ పాడిన పాటలు అలరించాయి.
అనంతరం ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు గారు మాట్లాడుతూ…అంబెడ్కర్ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.లింగాల చౌరస్తాలో ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి ఆధునికరించి విస్తృతపరుస్తామని మరియు హజీపూర్ చౌరస్తాలో అంబెడ్కర్ విగ్రహం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.