అంబెడ్కర్ కార్యాలయాన్ని ప్రారంభించిన యువజన సంఘం అధ్యక్షుడు
ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో ఎస్సి కాలనీలో అంబెడ్కర్ యువజన సంఘం కార్యాలయాన్ని సంఘం అధ్యక్షుడు ఉప్పరి బాలరాజు ప్రారంభించారు.అనంతరం కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబెడ్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా సంఘం అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ…అంబెడ్కర్ ఆలోచన,విధానాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు సైదులు,ప్రధాన కార్యదర్శి జి.బాలరాజు,ప్రచార కార్యదర్శి టి.శ్రీధర్,కార్యదర్శి ప్రహ్లాద్,కృష్ణ, భరత్,రమేష్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.